భూములను పరిశీలిస్తున్న జెసి
ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలోని గవి గట్టు గ్రామ సమీపంలో రైల్వే గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్వీకరించిన భూములను తహశీల్దార్ వీరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో జెసి నారపురెడ్డి మౌర్య శుక్రవారం పరిశీలించారు. భూములకు సంబంధించిన రికార్డులు సైతం పరిశీలించారు. ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మండల సర్వేయర్ తేజస్విని పాల్గొన్నారు.