రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ విజేతగా నిలిచిన విజయనగరం బాలుర జట్టు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కడప జిల్లాలో జరుగుతున్న అండర్ 17 వాలీబాల్ రాష్ట్ర ఛాంపియన్ షిప్ పోటీల్లో విజయనగరం బాలురుజట్టు రాష్ట్ర విజేతగా నిలిచింది. సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా జట్టు తో జరిగిన మ్యాచ్‌లో 2.1 తేడా తో గెలిచి విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టు క్రీడాకారులకు, కోచ్ కెవిఎఎన్ రాజు,( చిన్నారి), శివున్నాయుడులను డిఇఒ బి.లింగేశ్వర రెడ్డి, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎల్ వి రమణ, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.










