అండర్ 14 తైక్వాండ్
జట్లు ఎంపిక
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
తిరుపతి జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు స్కూల్ గేమ్స్ అండర్ 14 టైక్వాండో బాలురు, బాలికల విభాగానికి శుక్రవారం సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు ఎలమంచిలి ప్రవీణ్, కార్యదర్శి శ్రీధర్, స్కూల్ గర్ల్స్ సెక్రటరీ విజయకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ వలన శరీరము దఢంగా తయారు కావడమే కాకుండా మానసికంగానూ దఢంగా ఉంటారని, అదేవిధంగా డిఫెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రైల్వే కోడూరు నందు జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు, టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి విజరు కుమార్, గోపి నాయుడు, రూపేంద్ర రెడ్డి పాల్గొన్నారు.0










