ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :కాఫీ పిక్కల రా మెటీరియల్ తరలింపుతో తమకు పనులు దొరకవని నర్సీపట్నం కాఫీ క్యూరింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న కూలీలు ఆందోళన చెందు తున్నారు. గురువారం వారు ప్రజాశక్తితో మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా కాఫీ బోర్డు ఆధ్వర్యంలో కాఫీ పిక్కల గ్రేడింగ్ చేస్తున్నామని తెలిపారు. సుమారు 150 మంది కూలీలు పని చేస్తున్నామని, ప్రస్తుతం జిసిసి ఆధ్వర్యంలో ఈ క్యూరింగ్ జరుగుతుందన్నారు.కాఫీ పిక్కల రా మెటీరియల్ జిసిసి బయటకు తరలించకు పోతుందని, ఇక్కడ మెటీరియల్ లేక పోవడంతో తమకు పనులు లేకుండా పోతున్నాయని దీనిపై ఆధారపడి జీవిస్తున్న తమకు పనులు లేకపోతే ఏ విధంగా బతకాలని గోడును వెళ్ల బుచ్చారు. కాఫీ పిక్కల రా మెటీరియల్ ను లారీలపై తరలించుకుపోవడంతో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి.సత్తిబాబు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.










