Nov 05,2023 20:16

రక్తదాతలను అభినందిస్తున్న లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బాబ్జి

ప్రజాశక్తి - నెల్లిమర్ల : రైల్వే ప్రమాద బాధితులకు సాధన యువ జన సంఘం అండగా నిలిచిందని లోకసత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ అన్నారు. ఆదివారం జిజి హెచ్‌లో జరజాపు పేటకు చెందిన సాధన యువజన సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. గత నెల 29న కంటకాపల్లి సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆదుకోవాలన్న ఉదేశ్యంతో సాధన యువజన సంఘం అధ్యక్షుడు పోలుబోతు దుర్గ ప్రసాద్‌, రొంగలి దుర్గా ప్రసాద్‌, పసుమర్తి వెంకట రమణ ఆధ్వర్యంలో విజయనగరం జిజి హెచ్‌ రక్తనిధి కేంద్రంలో స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రైల్వే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల కోసం మానవత్వంతో రక్తదాన శిబిరం ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన సాధన యువజన సంఘం ఆలోచన అమోఘమన్నారు. రైల్వే బాధితులుకు అండగా ఉండడం అభినదనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నా ఊరు విజయనగరం ఎన్‌జిఒ అధ్యక్షులు గుమ్మడి విశాలాక్షి, అబ్దుల్‌ కలామ్‌ సేవా సమితి అధ్యక్షులు పైడిపు నాయుడు మాస్టర్‌, సంఘం సభ్యులు కనకల సురేంద్ర, మద్దిల మనోహర్‌, నల్లి వాసు, హరి సోమ నాయుడు, పట్నాయక్‌, గుడ్ల రాజ, సందీప్‌, దిల్లేశ్‌, సురేష్‌, బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది అప్పలనాయుడు, రమణ, శేఖర్‌,హరి పాల్గొన్నారు.