ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ఇప్ప తంగల్ గ్రామ కమిటీ దళితుల హక్కులపోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు డి మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు. విశ్రాంతి, ఎంఈఓ జయ రావు,నాగేంద్రరావు.కుప్పయ్య ,గ్యాస్ రవి, అపరంజి పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించారని అందరికీ సమానంగా హక్కులు కల్పించాలని స్త్రీలకు రిజర్వేషన్ కల్పించాలని తన పదవి సైతం త్యాగం చేశారని ఓటు హక్కును కల్పించాలని రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు తిరిగి అందరికి సమానంగా రాజ్యాంగాన్నిరూపొందించారని తెలిపారు. ఇంకా కూడా దళిత గ్రామాల పైన పెత్తందారులు.చలాయిస్తున్నారని రాజకీయంగా ఎదగడంలో పనిచేస్తున్నారని రిజర్వేషన్లను పొందిన అధికారం మాత్రం వాళ్లే నడిపిస్తున్నారని తెలిపారు చాలా గ్రామాల్లో అగ్రవర్ణాలు దళితులను గుడ్లకి కూడా రప్పించడం లేదని ఆవేదన చెందారు అందరూ అంబేద్కర్ చెప్పినట్లుగా బాగా చదివి ఉన్నత స్థాయికి అధికారాన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మంగయ్య ధనపాల్ చిన్నం కాలయ్యలక్ష్మణ్ మూర్తి వెంకటేష్ ధనుంజయులు ఆర్మూర్ సాయి రమేష్ భాస్కర్ వెంకటేష్ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










