Jul 02,2023 23:40

బహుమతులు ఇస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-హుకుంపేట:అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సంస్థ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో ఆదివారం 108,104,102 అంబులెన్స్‌ పైలెట్లు, టెక్నీషియన్స్‌, డేటా ఆపరేటర్లకు క్రికెట్‌, షటిల్‌ కాక్‌, చైర్‌ ఆటలను నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు అరబిందో కంపెనీ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. అనంతరం అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సంస్థ అల్లూరి సీతారామరాజు జిల్లా మేనేజర్‌ మురళి మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న అంబులెన్స్‌ సిబ్బందికి కొంత ఉపశమనం కలిగించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఆటల పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఒఇ రామసూరి, 108 ఒఇ ఇబ్రహీం పాల్గొన్నారు.