Sep 22,2023 19:48

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అభిమానులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
వైసిపి ప్రభుత్వంలో అపద్దాల మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు రంగస్వామి గౌడ్‌, చంద్ర హెచ్చరించారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణనుద్దేశించి 'రా.. రా.. దమ్ముంటే.. రా.. చూసుకుందాం' అంటూ అంబటి రాంబాబు అనవసరంగా రెచ్చగొట్టారని తెలిపారు. బాలకృష్ణపై తొడ గొడుతూ ఒక వీధి రౌడీలా ప్రవర్తించడం హేయమైన చర్య అని చెప్పారు. బాలకృష్ణకు తల్లి లాంటి సినిమా రంగంపై నానా దుర్భాషలాడుతూ సినిమా రంగాన్ని కించపరచి మాట్లాడటం సరి కాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయని చెప్పారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు రమేష్‌, ఈరన్న, రాజు, గిడ్డయ్య, వీరేష్‌, ధన, దస్తగిరి, రాముడు, వినరు పాల్గొన్నారు.