Apr 20,2023 22:47

ప్రజాశక్తి-వత్సవాయి : సమసమాజ స్థాపనకు మహనీయులు చేసిన కృషి వెలకట్టలేమని జగ్గయపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని చిట్యాల గ్రామంలో ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, భారత ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌, జగజ్జీవరాం చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాలని అన్నారు. భావితరాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ గురించి వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మారేళ్ళ అమ్మిరెడ్డి సత్యనారాయణరెడ్డి ట్రస్ట్‌ అధ్యక్షులు మారేళ్ళ పుల్లారెడ్డి బ్రదర్స్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు వేల్పుల రవికుమార్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వికలాంగుల అధ్యక్షురాలు సుజాత, సర్పంచ్‌ జలా పెద్ద కోటేశ్వరరావు, జడ్పిటిసి యేసుపోగు దేవమణి, ఎంపీటీసీ కోదముల తేజశ్రీ, మండల పార్టీ అధ్యక్షుడు గాదేల రామారావు, తదితర ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.