ఫొటో : అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దళితులు
అంబేద్కర్ విగ్రహం వద్ద దళితుల నిరసన
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం దళితులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు పొంగులూరు ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌రావణ్‌పై దుండగులు జరిపిన కాల్పులను తీవ్రస్థాయిలో ఖండించారు. యోగి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి దళితులపై దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. అనేక హత్యలు, అత్యాచారాలతో ఆ రాష్ట్రంలో అరాచక శక్తులు తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో యోగి ఆజాద్‌ను అనేక నెలలు జైల్లో ఉంచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎల్లు సాల్మన్ రాజ్ తదితరులున్నారు.










