
ప్రజాశక్తి - చెరుకుపల్లి: జాతీయ రహదారి వెంబడి ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించవద్దని దళిత సంఘాల నాయకులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం జరిగిన జగన్ అన్నకు చెబుదాం స్పందనలో పలువురు దళిత సంఘాల నాయకులు విగ్రహాన్ని యధా స్థానంలో ఉంచాలని కలెక్టర్‌ను కోరారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తొలగించే లా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో రిట్ దాఖలు చేయగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రేపల్లె ఆర్డీవో ఆధ్వర్యంలో కమిటీ నియమించామని తెలిపారు. కమిటీ నియమ నిబంధనలను అనుసరించి విగ్రహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు జాలాది బుజ్జి, సుబ్బయ్య, లాజరు, సురేష్, ప్రభాకరరావు, త్యాగయ్య, జై భీమ్ జిల్లా అధ్యక్షులు దోవా రమేష్ రాంజీ, గురిందపల్లి సిద్ధార్థ పాల్గొన్నారు.