ప్రజాశక్తి-పర్చూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అనపర్తిలో జరిగిన పర్యటనను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ సైకో ప్రభుత్వం అంటూ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు పర్యటన అడ్డుకోవటం ప్రజాస్వామ్య విలువలను నీరుగార్చటమేనన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు షేక్ షంషుద్దీన్, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కృష్ణ, మక్కెన శేఖర్‌బాబు, ధూళిపల్లి వెంకటస్వామి, షేక్ హుస్సేన్, తులసి శ్రీనివాసరావు, కిరణ్, కె శివ, అప్పలనేని నరేంద్ర, ఎంపిటిసి సభ్యులు కాపు రవిచంద్ర, గోరంట్ల రామకృష్ణ, ఖాజా వలి, అప్పలనేని వెంకట్, సమీర్, బుల్లా మేస్త్రి, గౌస్, బహీర్, జాని తదితరులు పాల్గొన్నారు.










