ప్రజాశక్తి-విజయవాడ : నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పూర్తి చేయాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్వరాజ్యమైదానంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించారు. అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని కమిషనర్ ఆదేశాలు.ఈ ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహంతో పాటు మిగిలిన పనులు సైతం నిర్దేశించిన సమయంలోపు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లను కమిషనర్ ఆదేశించారు. అదేవిధముగా నిర్ణీత గడువు లోపుగా అన్ని అభివద్ది పనులను పూర్తి చేయాలని, అవసరమైనచో అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకుని,రాత్రి వేళలలో కూడా పనులు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మతివనం, విగ్రహం పూర్తి చేయాలని కాంట్రాక్టర్స్ కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు, కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.










