
ప్రజాశక్తి-అచ్యుతాపురం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన వ్యాన్‌పై అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. పాటలు పాడుతూ, మందు గుండు వెలిగించి, జై భీమ్, అంబేద్కర్ జైహింద్ అనే నినాదాలు చేశారు. అంబేద్కర్ గీతాలతో పాటు జానపద గీతాలు పాడారు. ఈ సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రేవిడి జానీ, మైలపల్లి శ్రీనివాసరావు, రేవిడి శ్రీను, వినరు, మనోహర్, భాను, ఇస్మాయిల్, సూరిబాబు, రేమిడి కష్ణ, శివలింక కష్ణారావు, దిమ్మల జగ్గారావు, భాస్కర్ రావు, తట్టా కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సబ్బవరం : మండలంలోని బంగారమ్మ పాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా వైసిపి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కోటాన రాము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్లి నూకరాజు, సూరిసెట్టి రాము, దువ్వాడ అప్పారావు, కిల్లి సత్యనారాయణ, ఎంఎల్.నాయుడు, వంకర దేముడు, మల్లేశ్వరరావు, బత్తిన కోటి, దొడ్డి చిన అప్పారావు, కోనేరు శివ పాల్గొన్నారు.