ప్రజాశక్తి -తగరపువలస : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను పలువురు దళిత విద్యార్థులకు దళిత, ఆదివాసీ సంఘాల జెఎసి జిల్లా కన్వీనర్ పతివాడ రాంబాబు ఆదివారం భీమిలి మండలం, తాళ్ళ వలస గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, ఆయన జీవిత చరిత్రను చదవాలని కోరారు. దళిత, ఆదివాసీ సంఘాల మండల కన్వీనర్ బోని ఈశ్వర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా, ఇటీవల టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన ప్రశాంతిని ఘనంగా సత్కరించారు. మాజీ సర్పంచ్ బోని వెంకట రమణ, దళిత సంఘాల నాయకులు ఉప్పాడ అప్పారావు, గుడివాడ కిరణ్‌కుమార్, బోని నరసింగరావు, ఎం కన్నారావు, చంద్ర శేఖర్, ప్రసాద్, కె.హరిబాబు, సిహెచ్ అప్పలరాజు, భాస్కరరావు తది తరులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.










