Oct 14,2023 00:06

అంబేద్కర్‌ గురుకులం సమీపంలో మద్యం షాపు ఏర్పాటు నిర్ణయం మార్చుకోవాలి..

అంబేద్కర్‌ గురుకులం సమీపంలో
మద్యం షాపు ఏర్పాటు నిర్ణయం మార్చుకోవాలి..
ప్రజాశక్తి -కోట : నూతనంగా గురుకుల పాఠశాల సమీపంలో మద్యం షాపు ఏర్పాటు నిర్ణయాన్ని సంబంధించి అధికారులు మార్చు కోవాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం కోట మండలంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబే ద్కర్‌ గురుకులానికి సమీపంలో ల్యాండ్‌ మార్క్‌ గా ప్రభుత్వ వైన్‌ షాప్‌ ఏర్పాటుకు చేస్తున్న సన్నాహాలను తక్షణమే మాను కోవాలన్నారు. పాఠశాల పక్కనే మద్యం షాపు ఏర్పాటు చేస్తే తమ పిల్లలు పరిస్థితులు దారుణంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు (యవ్వన దశలోవున్న విద్యార్థులు) మద్యానికి అలవాటుపడి చెడు వ్యసనాలకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా పిల్లలు భవిష్యత్తును దష్టిలో వుంచుకుని ఉన్నతాధికారులు, నాయకులు మద్యం షాపు ఏర్పాటు ఇర్యఆనిన ఉపసంహరించు కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై సెబ్‌ (ఎక్సైజ్‌) డిపో సీఐ కిషోర్‌ని ఫోన్లో వివరణ అడగగా గురుకుల పాఠశాల సమీపంలోని 300 మీటర్లు దూరంలో మద్యం షాపు ఏర్పాటుకు స్థలం పరిశీలించడం వాస్తవమే రెండు, మూడు రోజుల్లో నివేదికను సిద్ధం చేసి పై స్థాయి సంబందించిన అధికారులు పంపుతామని తెలిపారు.