Jun 05,2023 21:10

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న దళిత నేతలు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ భవన నిర్మాణం కోసం కేటాయించిన ఎమ్మిగనూరు గ్రామ సర్వే నెంబర్లు 251/1,251/3 పైకిలో గల 1.60 ఎకరాల భూమిని సర్వేయర్‌తో సర్వే చేయించి భూమి సరిహద్దులు చూపించి, చుట్టూ కంచె వేయించి భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా స్థలాన్ని పరిరక్షించాలని దళిత సంఘం నాయకులు కోరారు. సోమవారం తహశీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్‌ స్పందిస్తూ... సర్వేయర్‌ను పంపి సర్వే చేసి సరిహద్దులు చూపుతామని హామీ ఇచ్చారు. దళిత, ప్రజా సంఘాల నాయకులు, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ భవన సాధన కమిటీ ఛైర్మన్‌ కదిరికోట ఆదెన్న, పూలే, అంబేద్కర్‌ ఐడియాలజీ కన్వీనర్‌ ఎసి.దేవదానం, కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కనకవీడు రాజు, మాల మహానాడు (జూపూడి వర్గం) తాలూకా ప్రధాన కార్యదర్శి కెఎం.హుస్సేనప్ప, దళిత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు రోజా ఆర్ట్స్‌ హుస్సేని, ఎఐఎఫ్‌టియు నాయకులు డి.సంజీవ్‌, కెవిపిఎస్‌ నాయకులు సుమాల ఆంథోని, గుంటెప్ప పాల్గొన్నారు.