ప్రజాశక్తి-అనకాపల్లి
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆయన ఆశయాలు దేశానికి దిక్సూచి వంటివని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పేర్కొన్నారు. అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా స్థానిక భీముని గుమ్మంలో అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పలక యశోద రవి, కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్న లక్ష్మి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటరమణ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి టి.అజరు బాబు, ఎస్సీ హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు. టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేశారు. భీముని గుమ్మం అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కటారి అప్పారావు నివాళులర్పించారు. డివిఆర్ క్యాంపు కార్యాలయంలో వైసిపి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేశారు. గవరపాలెం అంబేద్కర్ నగర్ వద్ద రేపాక రామారావు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎఎంఎఎల్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జి జయ బాబు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. తుమ్మపాల ఇందిరా కాలనీలో సబ్ రిజిస్ట్రార్ బంగారు వెంకటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రామచంద్ర థియేటర్ జంక్షన్ వద్ద దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సబ్బవరం : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఇఒ ఎస్.అప్పలరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం సిహెచ్.చిన్నమ్మాయి పిడి రెహమాన్, ఉపాధ్యాయులు పివి.భాస్కరరావు, పి.ప్రసాద్, కుమార్ ప్రకాష్, రాధాకుమారి, డేవిడ్ సురేష్, శ్రీనివాసరావు, గురునాథరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి సబ్ రిజిస్ట్రార్ బంగారి వెంకటేశ్వరరావు పూలమాలను వేశారు. సీనియర్ అసిస్టెంట్ శంకర్రావు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కశింకోట : స్థానిక బిసి బాలురు వసతి గృహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నారాయణరావు, దళిత నాయకులు పావాడ సన్యాసిరావు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై టిడిపి నాయకులు ఉగ్గిన రమణమూర్తి, మాజీ ఎంపిపి పెంటకొట సుబ్బలక్ష్మి, పెంపకోట రాము, సిదిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు.
దేవరాపల్లి : స్థానిక నాలుగు రోడ్ల కోడలిలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని అలమండలో దళిత నాయకులు పల్లా సంతోష్ ఆధ్వర్యంలో సర్పంచ్ దాడి జగన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, జడ్పిటిసి కర్రి సత్యం, మాజీ జడ్పిటిసి పోతల పాత్రునాయుడు ఎంపీటీసీ కృష్ణమూర్తి పాల్గొన్నారు
వడ్డాది : బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట, వడ్డాది గ్రామాల్లో అంబేద్కర్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ కోరుకొండ కామలక్ష్మీ సూరి అప్పారావు, ఎడ్ల రామ్మూర్తి, మీసాల మోహన్‌రావు, కోరుకొండ విజరు, వంగల గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిపిసిలో అంబేద్కర్ వర్థంతి
పరవాడ : అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఎన్టీపీసీ సింహాద్రి సవ్యస్ బిల్డింగ్ సమ్మంద్ హల్‌లో అంబేద్కర్ చిత్రపటానికి ఎన్టిపిసి హెచ్‌ఓపి జిసి చౌక్, సిజిఎం బి.రామారావు, ఎస్.గోవిందరాజన్, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిఎమ్, హెచ్‌ఓడిలు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చీడికాడ:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గొల్లవెల్లి రాజబాబు, జడ్పిటిసి లాలం శారద వరలక్ష్మి జానకిరామ్, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఎర్ర అప్పారావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పరవాడ మహేష్, పాల సంఘం డైరెక్టర్ పరవాడ రామారావు, కార్యకర్తలు పుట్టా రామ్ కుమార్, కరగాన శివ పాల్గొన్నారు.
నర్సీపట్నం రూరల్: అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర నివా ళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నాయకులు నమ్మి రమణరాజు, వేగి శెట్టి శ్రీను, మాకిరెడ్డి వెంకటరమణ, సప్పా నానాజీ పాల్గొన్నారు.
పాయకరావుపేట:పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి దళిత బహుజన పార్టీ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, టౌన్ ప్రెసిడెంట్ జెక్కల సూరిబాబు, పెదపాటి నూకరాజు పాల్గొన్నారు.
గొలుగొండ: ఏఎల్‌పురంలో సర్పంచ్ లోచల సుజాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పంచారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. జోగుంపేటలో సర్పంచ్ జువ్వల లక్ష్మి మండల మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జువ్వల దేముడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిట ్లఅప్పారావు మాస్టారు, బుంగ మాణిక్యం, చిగిలి అచ్చిరాజు, చేపల దేవుడు, జువ్వల నారాయణ పాల్గొన్నారు.
గొలుగొండ గ్రామ పంచాయతీ శివారు పేట మాలపల్లి స్కూలు ఆవరణలో మాజీ జెడ్పీటీసీ చిట్ల చలపతిరావు. గొలుగొండ గ్రామ సర్పంచ్ కసిపెల్లి అప్పారావు(బుజ్జి), జక్కు అప్పలస్వామి నాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వార్డు మెంబర్ చిట్ల నూకరాజు అప్పారావు, చంటి, నిక్కల రాజబాబు, కొల్లా బత్తిన కళ్యాణ్ పాల్గొన్నారు.
మాడుగుల:వీరవల్లి అగ్రహారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు. మండల వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, ఎం.కోడూరు సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు, వీరవల్లి సర్పంచ్ వెలగాడ కామ లక్ష్మి ఈశ్వరరావు, వైస్ సర్పంచి ధనమ్మ హరి, మాజీ వైస్ సర్పంచ్ దాడి రాజేశ్వరరావు, బొబ్బాది ఈశ్వరరావు, కామరాజు, డీజే చిన్న, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మాకవరపాలెం:తామరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి గొంతిన హరిబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గిడుతూరు, మల్లవరం, బూరుగు పాలెం తదితర గ్రామాల్లో వర్ధంతి నిర్వహించారు.
కొత్తకోట: కొత్తకోట గ్రామ అంబేద్కర్ కాలనీ వన్ లో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ బాలయ్య, బి. బుల్లిబాబు, మల్లేటి రాజు, ఎంపిటిసి పూడి దేవ, పూడి అప్పారావు, నాగరాజు, టి.శేఖర్ పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:గోకులపాడులో అంబేద్కర్ విగ్రహానికి పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నూకినాయుడు, లోవరాజు శ్రీను, ప్రసాద్, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










