ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ద్వారకాతిరుమలలో బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండలంలోని సిహెచ్.పోతేపల్లి గ్రామంలో సోంబాబు మనవడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వనిత మార్గం మధ్యలో ద్వారకాతిరుమలలో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎంపిపి, జెడ్‌పిటిసి సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










