Oct 08,2023 23:54

అంబేద్కర్‌ ఆశయాల సాధనకు కషి చేయాలి

అంబేద్కర్‌ ఆశయాల సాధనకు కషి చేయాలి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌ : ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం కషి చేయాలని డాక్టర్‌ కె.వి నాయుడు పేర్కొన్నారు. పుత్తూరు రూరల్‌ మండలం ఉత్తరపు కండ్రిగకు చెందిన డాక్టర్‌ కె వి నాయుడు. డాక్టర్‌ వత్తిలో విదేశాల్లో అమెరికాలో పనిచేస్తున్నారు. ఆయన ఉత్తరపు కండ్రిగ దళితవాడలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన సొంత నిధులతో ఏర్పాటుచేసి ఆదివారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కేవీ నాయుడు మాట్లాడుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కులమత బేధాలు లేకుండా ఐకమత్యంతో మెలగాలని ఆయన ఆశయ సాధనల కోసం కషి చేయాలని అన్నారు. యువకు లు అందరూ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలిపారు. ఎవరైనా చదువుకొని ఆర్థిక స్తోమత లేకుండా ఉన్న పిల్లలు ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని వారు ఉంటే. వారికి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో. సర్పంచి బుజ్జిబాబు. ఉపసర్పంచ్‌ ఉదరు కుమార్‌. సామాజిక కార్యకర్త నాగేంద్రరావు. అంబేద్కర్‌ ట్రస్ట్‌ కోశాధికారి కుప్పయ్య., సబ్‌ రిజిస్టర్‌ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ రాజేంద్ర, రవి నాయుడు, ప్రసాద్‌, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.