ప్రజాశక్తి - తాళ్లరేవు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కషి చేయాలని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. గురువారం ఆయన తాళ్లరేవు బుద్ధ విహార్‌లో యువకులకు బౌద్ధ ధమ్మం గురించి బోధించారు. 12 మందికి బౌద్ధ దమ్మ స్వీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ కమాండెంట్ దారా సుబ్బరాజు, బిఎస్‌ఐ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల కుటుంబరావు, గుత్తాల సుబ్రహ్మణ్యం, వడ్డి సిద్ధార్థ, దడాల రామకష్ణ, పెయ్యల రమేష్, విప్పర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










