Jun 28,2023 20:37

విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
భారత రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యులని ఎస్సీ కమిషన్‌ సభ్యులు కట్టెపోగు బసవరాజు తెలిపారు. బుధవారం మండలంలోని వగరూరు, తిమ్మాపురం గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహ దాత డాక్టర్‌ మల్లెల ఆలెఫ్రైడ్‌ రాజు, కదిరికోట సునీల్‌ కుమార్‌, జై భీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొందిమడుగులు టిఎం.రమేష్‌, వి.తిమ్మాపురం సర్పంచి వీరారెడ్డి, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపిడిఒ మణిమంజరి, సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు, జిల్లా అధ్యక్షులు ముత్తు, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న పాల్గొన్నారు.