అంబెడ్కర్ విగ్రహన్నీ ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
విద్యార్థి, యువజన,ప్రజా సంఘాల డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల రూరల్.
స్థానిక నంద్యాల పట్టణము లో బొమ్మలసత్రం వద్ద ఉన్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంషం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి,యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబెడ్కర్ గారి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు,వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. రియాజ్* మాట్లాడుతూ నంద్యాల నగరంలో బొమ్మలసత్రం వద్ద ఉన్న డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని,జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్పీ ఆఫీస్ కూత వేటు దూరంలో ఉన్న కూడా అంబెడ్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని,గతంలోనే అంబెడ్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల నగర నడి బొడ్డులో పెట్టాలని ఎన్నో ధర్నాలు,దీక్షలు,పోరాటాలు చేశామని,కానీ జిల్లా కలెక్టర్ గారు గాని,స్థానిక ఎమ్మెల్యే గారు గాని,ఎంపీ గారు కానీ స్పందించక పోవడం చాలా బాధాకర మైన విషయమని,నంద్యాల నడ్డి ఒడ్డున ఉన్న అధికార, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన విగ్రహాలకు లేని అడ్డు,ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహంకు మాత్రమే అడ్డు రావడం చాలా బాధాకరమైన విషయమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల ప్రధాన సెంటర్లలలో ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతామని వారు హెచ్చరిక తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆర్,యస్,ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు,జిల్లా అధ్యక్షుడు పూల వెంకట్,గిరిజన విద్యార్ధి సంఘము రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు.రవీంద్ర నాయక్,ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ సభ్యుడు దిలీప్,మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు N.లక్ష్మణ్ మాదిగ,ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కోటేష్ మాదిగ,బీసీ,సంఘము జిల్లా అధ్యక్షులు నాగశేషులు, మాలమహనాడు అధ్యక్షులు. చెన్నయ్య, ఎమ్మార్పీఎస్ జనరల్ సెక్రటరీ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.










