ప్రజాశక్తి - టి.నరసాపురం
అమూల్ పాల కేంద్ర్రాల ఏర్పాటుతో పాడి రైతులకు మేలు చేకూరుతుందని కె.జగ్గవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి మధు అన్నారు. మండలంలోని కె.జగ్గవరంలో జగనన్న పాలవెల్లువలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన అమూల్ పాల కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేతవరం సర్పంచి తడికలపూడి శివ మాధవి కిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధు మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అమూల్ పాల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కేంద్రాలు సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. దళారుల ప్రమేయం లేకుండా పాడి రైతుల సొమ్ము నేరుగా పారదర్శకంగా వారి ఖాతాల్లో జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో కె.జగ్గవరం సొసైటీ సిఇఒ తనగాల వీరవెంకయ్య, ఎంపిటిసి బొడ్డపాటి రాంబాబు, వెలిది రాంబాబు, ఎస్.నాగేశ్వరరావు, బర్రె రవిబాబు, పరసా రాజ్‌కుమార్, బర్రె విజరు పాల్గొన్నారు.










