ప్రజాశక్తి - చీరాల
వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణితో పర్చూరు వైసిపి ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. స్థానిక మసీద్ సెంటర్లోని అమ్మ ఐ మల్టీస్పెషాలిటీ హాస్పటల్‌లో డాక్టర్ ఛాంబర్‌లో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇటీవల తాడేపల్లిలో విజయ సాయిరెడ్డిని కలవడానికి వెళ్ళిన డాక్టర్ అమృత పాణికి ఆమంచి ఎదురు పడగా పలకరించుకున్నారు. వీరి కలయిక పట్టణంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే కంటి ఇన్ఫెక్షన్ రావటంతో చికిత్స కోసం కలిసినట్లు ఆమంచి అనుచరులు చెబుతున్నారు.










