Aug 05,2023 22:13

శంకుస్థాపనను తిలకించేందుకు ఏర్పాటు చేసిన టివిలు

* నేడు వర్చువల్‌ విధానంలో ప్రధాని శంకుస్థాపన
ప్రజాశక్తి - పలాస: 
అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా పలాస రైల్వేస్టేషన్‌ ఎంపికైంది. ఈ పథకాన్ని ఎంపికైన దేశంలోని 508 రైల్వేస్టేషన్లలో ఆధునికీకరణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రైల్వే అధికారులు పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాట్లు చేశారు. ఖుర్దా డివిజన్‌ పరిధిలోని పలాస రైల్వేస్టేషన్‌ అభివద్ధికి రూ.23.85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైల్వేస్టేషన్‌లోని 1ఎ, 1, 2, 3 ఫ్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేస్తున్న సమయంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తిలకించేందుకు టివిలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందుల్లేకుండా టార్ఫాలిన్లతో టెంట్లు వేశారు. ఈ కార్యక్రమానికి ఖుర్దా డివిజన్‌ నుంచి రైల్వే ఉన్నతాధికారులు హాజరు కానున్నారని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.