ప్రజాశక్తి - వన్‌టౌన్: విఫ్రా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమత్ భారత్ రథయాత్ర కాంచీపురం నుండి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ వెంకటేశ్వర్ స్వామి వారి దేవాలయం వద్దకు మంగళవారం చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రథయాత్రకు స్వాగతం పలికారు. బ్రాహ్మణ వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇఓ గెల్లి హరిగోపీనాథ్ బాబు, వేదపండితులతో కలిసి గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, ఎమ్మెల్యే వెలంపల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత నది మీద విఫ్రా ఫౌండేషన్ మరియు భారత ప్రభుత్వంచే రూ. 51 కోట్ల నిధులతో 51 అడుగుల శ్రీ పరుశురాముని విగ్రహం నిర్మించనున్న సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఆహ్వానిస్తూ నిర్వహించిన యాత్ర పరశురామ కుండ్ అమంత్రన్ యాత్రలో భాగమే అమత్ భారత్ రథయాత్ర అని నిర్వాహకులు తెలిపారు.










