
అమరావతి : జై అమరావతి పోరాటం ప్రారంభించి 600 రోజులైన సందర్భంగా జెఎసి పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సరైంది కాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాన్లలో కుక్కి రైతుల కాళ్లు విరగ్గొట్టారని పేర్కొన్నారు. మహిళల పట్ల పోలీసులు విచక్షణ లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత ధోరణి బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధులను నిర్బంధించారని ఆక్షేపించారు.