Aug 14,2023 22:25

ప్రజాశక్తి - ఆకివీడు
             దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను ఎన్నటికీ మరువరాదని, వారు చిరస్మరణీయులని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. నా మట్టి- నా దేశం అమరవీరులకు వందనం కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ ఆకివీడు వచ్చారు. దేశ సైనికుడిగా పనిచేసి విధి నిర్వహణలో అసువులు బాసిన వీర సైనికుడు గంట్ల వీర వెంకట నాగ గోవర్ధన్‌ తల్లిదండ్రులు గంట్ల వెంకట్రావు, వెంకటలక్ష్మిలను ఆమె సన్మానించారు. ప్రధానమంత్రి నుంచి అందిన సందేశాన్ని ఆమె వారికి అందించారు. తొలుత గోవర్ధన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కెవిఎస్‌.ప్రసాదరావు, డిపిఒ జివికె.మల్లికార్జునరావు, నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ జామి హైమావతి, కమిషనర్‌ కెవి.కృష్ణమోహన్‌, మాజీ సైనికులు ఎం.సత్యనారాయణ, ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహశీల్దార్‌ ఎంబి విజయలక్ష్మి, ఎంపిడిఒ కె.వాణి, ఎంఇఒ ఎ.రవీంద్ర, వాయిస్‌ సెర్మర్లు పుప్పాల సత్యనారాయణ, వంగా జ్యోత్స్న, అవార్డు కౌన్సిలర్‌ దొడ్డి జగదీష్‌ పాల్గొన్నారు.
పెనుమంట్ర :ప్రతి విద్యార్థి త్రివర్ణ పతాకం గురించి అవగాహన కలిగి ఉండాలని నత్తా రామేశ్వరం సర్పంచి వెలగల ధర్మారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నా భూమి - నా దేశం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి శ్రీశైలపు నాగేంద్రకుమార్‌ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి విద్యార్థులకు ఆగస్టు 15, స్వాతంత్ర పోరాటంలో అమరవీరుల త్యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు వి.నాగమణి, ఉపాధ్యాయురాలు కె.సాయితులసి, సచివాల య ఉద్యోగులు సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ :ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నా మట్టి - నా దేశం నేల తల్లికి నమస్కారం - వీరులకు వందనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, దేశ రక్షణ కోసం పనిచేసిన రక్షణ దళం రిటైర్డ్‌ ఉద్యోగుల సత్కార వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌, ఎంఎల్‌ఎ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ఆచంట అలివేలు, కామన బాల సత్యనారాయణ, ఆశపు కోటిలాల్‌లను, త్రివిధ దళ రిటైర్డ్‌ ఉద్యోగులు లెఫ్టినెంట్‌ కర్నూల్‌ ఆర్‌కెవి.రావు, సీనియర్‌ నాన్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఎవి.రమణ, నాయక్‌, జోగి బాలరాజు, కె.జాన్‌ఫెడరిక్‌, ఎం.సుధాకర్‌లను ఘనంగా సన్మానించారు.
భీమవరం రూరల్‌ :డిఎన్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ వారితో యనమదుర్రు గ్రామంలో నా మట్టి-నాదేశం కార్యక్రమం కళాశాల దత్తత గ్రామమైన యనమదుర్రులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సుమారు 75 మొక్కలు నాటారు. యనమదుర్రు గ్రామ సెక్రటరీ జి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటినట్లు చెప్పారు. గ్రామ సర్పంచి బురబత్తుల శ్రీరామమూర్తి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.అంజాన్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ వి.ప్రవీణ్‌ మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యాక్రములో డాక్టర్‌ జిజి.రత్నం, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌, యమమదుర్రు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.