
ప్రజాశక్తి - ఆచంట
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను, జవాన్లను స్మరించు కోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఎంపిడిఒ నరసింహ పసాద్ అన్నారు. అమర జవాన్లు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి మంగళవారం స్థానిక రామేశ్వర స్వామి కల్యాణ మండపం ఆవరణలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నరసింహప్రసాద్ మాట్లాడుతూ నామట్టి.. నాదేశం పేరుతో అమరవీరుల జ్ఞాపకార్థం నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిజ్ఞ, ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సుగుణ సంధ్య, ఆచంట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ఆనంద్‌బాబు, పోలీస్ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్ నీలిమ, ప్రభుత్వ, జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.