సంసర్మరణ దినోత్సవం నిర్వహిస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రజా రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు కొనియాడారు. శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉమేష్ చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజా రక్షణకు ప్రాణాలు కోల్పోయిన వారికి జోహారు అంటూ సెల్యూట్ చేశారు. ఎఎస్‌ఐ ఆనంద్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, పోలీసులు చెన్నబసప్ప పాల్గొన్నారు.










