Oct 21,2020 20:42

పోలీసు అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

ప్రజాశక్తి-కంటోన్మెంట్‌  :  ప్రజల భద్రత, ధన, మాన ప్రాణాల రక్షణకు కషి చేస్తూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలకు సైతం కోల్పోతున్న పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, ఎస్‌పి బి.రాజకుమారి అన్నారు. అంతరంగిక భద్రతకు ప్రాణ త్యాగాలు చేసిన పోలీసులే రియల్‌ హీరోలని కొనియాడారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోగల 'స్మతి వనం'లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, పోలీసు అమరవీరులకు స్మతి స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో దేశ వ్యాప్తంగా అమరులైన 264మంది పోలీసుల వివరాలతో కూడిన పుస్తకాన్ని కలెక్టర్‌, ఎస్‌పి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజ భద్రత, సామరస్యానికి, శాంతికి పోలీసులు విశేషంగా కషి చేస్తున్నారని, విధి నిర్వహణలో పోలీసుల చేస్తున్న త్యాగాల కారణంగానే నేడు సమాజంలో మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. అసాంఘిక శక్తులపై జరిగిన పోరాటంలో విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులకు, వారిని కోల్పోయిన పోలీసు కుటుంబాలకు మనమంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ పోలీసులు నేర రహిత సమాజం కోసం ప్రజలతో స్నేహితులుగా వ్యవహరిస్తూ, నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలే సమయంలో పోలీసులు ఫ్రంట్‌ లైను వారియర్స్‌ గా ముందు వరుసలో నిలబడి, విధులు నిర్వహించారని తెలిపారు. కరోనా బారిన పడి మతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర డిజిపి అండగా నిలిచారన్నారు. జిల్లాలో మావోయిస్టుల దాడుల్లో మతి చెందిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అనంతరం అమరులైన పోలీసులను స్మరించుకొంటూ, స్మతి స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి ఎన్‌. సత్యన్నారాయణరావు, ఒఎస్‌డి ఎన్‌. సూర్యచంద్రరావు, కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ కులకర్ణి, విజయనగరం డిఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, సిసిఎస్‌ డిఎస్‌పి జె.పాపారావు, ట్రాఫిక్‌ డిఎస్‌పి ఎల్‌. మోహనరావు, మహిళా పిఎస్‌ డిఎస్‌పి ఎం. శ్రీనివాసరావు, అమరుల కుటుంబీకులు, అధికారులు, సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు జ్ఞాపికలను, పండ్లు, స్వీట్స్‌, నగదును జిల్లా కలెక్టరు అందజేశారు. అంతకుముందు పోలీసు కార్యాలయం నుండిఆర్‌ అండ్‌ బి బంగ్లా కూడలి వరకు పోలీసులు ర్యాలీని నిర్వహించారు. 
పోలీస్‌ శిక్షణ కళాశాలలో 
పోలీసు శిక్షణా కళాశాల లో అమరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ బి.మెహర్‌బాబు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు, తదితర అసాంఘిక శక్తులు హింసకు పాల్పడుతుంటే, ఆ శక్తులను ఎదుర్కొంటూ పోలీసులు వీర మరణం పొందుతున్నారు. వారందరికీ జోహార్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎస్‌పి డి.ఆశీర్వాదం, సిఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.