ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : స్వాతంత్య్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవాల్సిన కర్తవ్యం అందరిపైనా ఉందని జలవనరుల శాఖ మత్రి అంబటి రాంబాబు అన్నారు. స్వాతంత్య్రోద్యమ నాయకుల త్యాగాల స్ఫూర్తిని యువత పొందాలని సూచించారు. మున్సిపాల్టీ ఆధ్వర్యంలో నా దేశం - నా మట్టి కార్యక్రమంలో సోమవారం నిర్వహించగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రా గాంధీగా గుర్తింపు పొందిన వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని, వారి స్ఫూర్తిని యువతకు అందించడానికి ప్రతిఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఆయన మనవడు సోడేకర్‌తో నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో వావిలాల సత్యం, సైనికులు కర్రిబోయిన సుధాకర్, అమర జవాను నేలపల్లి నేతాజీ తల్లిదండ్రులు వీరమ్మ భాస్కర్‌రావును ఘనంగా సత్కరించారు. నేలతల్లి వందనం కార్యక్రమంలో భాగంగా 75 మొక్కలను నాటడంతోపాటు వావిలాల ఘాట్ వద్ద అమరవీరుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.










