Oct 30,2023 20:37

పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు

పార్వతీపురంరూరల్‌: జిల్లాలో పోలీసు అమరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణ సిఐ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం ప్రధాన రహదారిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా రక్షణే ధ్యేయంగా ప్రాణాలను కూడా పణంగా పెట్టి విధి నిర్వహణలో మరణించిన పోలీసుల అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో శాంతి భద్రతల నిర్వాహణలో పునరంకితం అవుతామని తెలిపారు. పాత బస్‌ స్టాండ్‌ నుండి 4 రోడ్‌ జంక్షన్‌ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని పోలీసు అమరుల చిత్రపటాలకు నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కుమార్‌, శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌ఐ దినకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.