అదిగో ...
ఆ కటిక శిలను
సజీవ శిల్పంగా చెక్కిందెవరు?
ఆ బీడు నేలను
సస్య క్షేత్రంగా మలిచిందెవరు?
ఆ నూలు పోగులను
సుందర వస్త్రంగా అల్లిందెవరు ?
ఆ కణుపుల వెదురును
స్వర వేణువుగా మార్చిందెవరు?
ఆ కఱ్ఱ దుంగను
సువర్ణ బొమ్మగా రూపద్దిందెవరు?
ఆ మట్టి ముద్దను
దైవ ప్రతిమగా ప్రతిష్టించిందెవరు?
ఆ కరడు ఇనుమును
మానవ పనిముట్టుగా చేసిందెవరు?
ఆ పసి మెదళ్లను
జ్ఞాన దీపికగా వెలిగించిందెవరు?
ఆ జంతు చర్మమును
డప్పు వాద్యంగా మలిచిందెవరు?
ఆ రాక్షస బొగ్గును
ఇంధన వనరుగా మార్చిందెవరు?
ఇన్ని అద్భుతాలకు
మూలం మనిషే కదా !
మరి అదే మనిషి
మానవత్వానికి 'అమరత్వం'
అద్దితే ఇంకెంత బాగుండు !
కోడిగూటి తిరుపతి
95739 29493