రైటప్ : అవార్డులు అందుకున్న సందర్భంగా..
'అమరరాజా'కు 9 బంగారు అవార్డులు
ప్రజాశక్తి - రేణిగుంట అంతర్జాతీయ స్థాయిలో అమరారాజా సంస్థకు క్వాలిటీ సర్కిల్ విభాగంలో తొమ్మిది బంగారు అవార్డులు దక్కాయి. బీజింగ్ చైనాలో వర్చ్యువల్‌గా జరిగిన 48వ అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ పోటీల్లో సంస్థ నుంచి పాల్గొన్న పది టీమ్‌లకు 9 బంగారు, ఒక వెండి అవార్డు లభించాయి. ఈ పోటీలలో అమరరాజా సంస్థతో పాటు 14 దేశాల నుంచి 857 టీమ్‌లు పాల్గొన్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరినేని, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సి.నరసింహులునాయుడు తెలిపారు.
రైటప్ : అవార్డులు అందుకున్న సందర్భంగా..










