
ప్రజాశక్తి - బాపట్ల : చెరుకుపల్లి మండలంలో హత్యకు గురైన అమర్నాథ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య శుక్రవారం కోరారు. రాష్ట్రంలో సంచలనం సష్టించిన ఉప్పాల అమర్నాథ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తమ కుటుంబాన్ని అంతమొందిస్తానని బెదిరిస్తున్నట్లు మృతుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడిందంటే మానసికంగా ఎంత భయభ్రాంతులకు గురవుతోందో అర్థమవుతుందని అన్నారు. ప్రధాన నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డి ఇటీవల బెయిలుపై విడుదలై ఆ కుటుంబాన్ని బెదిరించడాన్ని ఆయన ఖండించారు. బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.