Jul 03,2023 01:54
ఉప్పాల అమర్నాథ్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న మందకృష్ణ

ప్రజాశక్తి-చెరుకుపల్లి: ఉప్పాల అమర్నాథ్‌ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని ఉప్పాలవారిపాలెం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి ఉప్పాల అమర్నాథ్‌ కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అమర్నాథ్‌ కుటుంబానికి ఎమ్మార్పీఎస్‌ ఎప్పుడు అండగా ఉంటుందని అమర్నాథ్‌ తల్లికి, సోదరికి మందకృష్ణ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.