Oct 03,2023 22:25

అమరలో సెరెబ్రల్‌ పాల్సి వ్యాధిగ్రస్తులకు ఉచిత సర్జరీలు

అమరలో సెరెబ్రల్‌ పాల్సి వ్యాధిగ్రస్తులకు ఉచిత సర్జరీలు
- అమర ఫౌండేషన్‌ ద్వారా ఉచిత సేవలు
- చైర్మన్‌ డాక్టర్‌ గౌరీనేని ప్రసాద్‌
ప్రజాశక్తి- రేణిగుంట : సెరెబ్రల్‌ పాల్సి వ్యాధిగ్రస్తులకు అమర ఆసుపత్రిలో ఉచిత చెకప్‌ లు, సర్జరీలు చేస్తామని అమర ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ గౌరినేని ప్రసాద్‌ స్పష్టం చేశారు. మంగళవారం రేణిగుంట మండలంలోని కరకంబాడి సమీపంలోని అమర ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్‌ గౌరీనేని ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచ సెరెబ్రల్‌ పాల్సి డే అక్టోబర్‌ 6 సందర్భంగా సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధి గ్రస్తులకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. చిన్నపిల్లలు పుట్టి నప్పుడు నుండి లేవలేక, కూర్చోలేక నడుములు నిలబడక, కండ రాలు పెరగక వ్యాధితో బాధపడుతుంటారని తెలిపారు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు జ్వరంతో బాధపడు తుండడం వల్ల గర్భంలో ఉన్న బిడ్డకు మెదడులో ఏర్పడిన లోపంతో పుట్టిన బిడ్డలకు ఈ వ్యాధి సోకుతుందన్నారు. సెరెబ్రల్‌ పాల్సితో బాధ పడుతున్న వ్యాది óగ్రస్తులకు అమర ఆసుపత్రిలో ఉచిత చెకప్‌లు. సర్జరీలు చేస్తామని తెలిపారు. సెరెబ్రల్‌ పాల్సి వ్యాధిగ్రస్తులకు ఉచిత పరీక్షలు ఆపరేషన్లు చేసి చేసి మందులు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ అవకాశం అక్టోబర్‌ మూడు నుండి పదవ తేదీ వరకు మాత్రమే అన్నారు. చిన్న పిల్లలలో సాధారణ నైపుణ్యాల అభివద్ధి ఆలస్యం కావడం అంటే ఉదాహ రణకు పాకడం, నడవడం లేదా మాట్లాడక పోవడం వంటి సమస్యలు కండరాలలో బలం రాక పోవడం, కండ రాలలో సమతుల్యత లేక పోవడం, వణుకు లేదా అసంక ల్పిత కదలికలు, మూర్చ జ్ఞాపక శక్తి సమస్యలు చిన్నపిల్లల్లో ఎలాంటి ఎముకల సమస్యలు లేదా నరాల సమస్యలు ఉన్నా ఉచితంగా ఏడు రోజులపాటు డాక్టర్‌ పరీక్షించి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఆపరేషన్‌ నిర్వహిస్తారన్నారు. సెరెబ్రల్‌ వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని పిలుపు నిచ్చారు. అమర హాస్పిటల్‌ ప్రముఖ చిన్నపిల్లల ఎముకల స్పెషలిస్ట్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ చిన్నపిల్లల్లోని సెరిబ్రల్‌ పాల్సీ ముందస్తు గుర్తింపుతో సకాలంలో సంరక్షణ సరైన మద్దతు అందిస్తే సెరిబ్రల్‌ పాల్సీ వ్యక్తులు సంతప్తికర జీవితం గడుపుతారన్నారు.
అమర ఫౌండేషన్‌ ద్వారా చికిత్సలు
సెరెబ్రల్‌ వ్యాధిగ్రస్తులకు అమర ఫౌండేషన్‌ ద్వారా ఉచిత పరీక్షలు ఆపరేషన్లు నిర్వహిస్తామని డాక్టర్‌ గౌరనేని ప్రసాద్‌ పేర్కొన్నారు. లాభాపేక్షతో కాకుండా సేవాదక్పథంతో సేవ చేస్తున్నట్లు తెలిపారు. సెరెబ్రల్‌ వ్యాధిగ్రస్తులు అవకాశాన్ని సద్విని చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అమర ఆసుపత్రి చీఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌, పిఆర్‌ఓ మునినాధం, మార్కెటింగ్‌ మేనేజర్‌ నరసింహ పాల్గొన్నారు.