Mar 16,2023 22:56

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిదని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివా సరావు కొనియాడారు. గురువారం స్థానిక విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద వున్న పొట్టి శ్రీ రాములు విగ్రహం వద్ద అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అంతరం కేకు కట్‌ చేశారు. అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి, విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, పెనుగొండ సుబ్బా రాయుడు, కార్పొరేటర్‌ గుడివాడ నరేంద్ర రాఘవ, సాదు సత్యనారాయణ, శేగు వెంకటేశ్వరరావు, గొంట్ల రామ మోహన్‌, బచ్చు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.