Feb 25,2023 22:48

ప్రజాశక్తి-కంచికచర్ల 

కంచికచర్ల మండలం పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం కల్చరల్‌ ఫెస్ట్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రధమ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డే మరియు థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఫేర్‌ వెల్‌ కార్యక్రమాలను కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ కె రామ్మోహన్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యం శశిధర్‌ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల లో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్‌ క్లబ్స్‌ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని , తద్వారా వారిలో లీడర్‌ షిప్‌ మరియు మేనేజింగ్‌ స్కిల్స్‌ తో పాటు ఆత్మ విశ్వాసం వంటి అంశాలు పెంపొందించు కోవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ నత్యాలను, నాటికలను, పలు చలన చిత్రాల గీతాలను , పాటలను ఆలపించి ప్రదర్శించారు. ముఖ్యంగా రీమిక్స్‌ సాంగ్స్‌ కు విద్యార్థులు ఉత్సాహం తో కేరింతల తో స్టెప్స్‌ వేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం బి.టెక్‌ మరియు పాలిటెక్నిక్‌ క్లాస్‌ టాపర్స్‌కు, సెక్షన్‌ టాపర్స్‌ కు ప్రశంసాపత్రాలు, మొమెంటోస్‌ అందచేశారు. అలాగే కళాశాల లో టీచింగ్‌ మరియు నాన్‌ టీచింగ్‌ విభాగాలలో విశిష్ట ప్రతిభ చూపిన అధ్యాపకులకు మొమెంటోస్‌, ప్రశంసాపత్రాలతో పాటు నగదుబహుమతు లను అంద చేసారు.