ప్రజాశక్తి-కంచికచర్ల
కంచికచర్ల మండలం పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులు సౌర శక్తి తో నడిచే వాహనాన్ని తయారు చేసారని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కె రామ్మోహన రావు తెలిపారు.బి.టెక్ ఈఈఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఒక కొత్త ఆవిష్కరణ కు రూపుదిద్దారు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఈఈఈ విభాగాధిపతులు సీ హెచ్ వీరయ్య మరియు టి. సుహాసిని వారి సలహాలతో, ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యం తో సౌర శక్తి తో నడిచే వాహనాన్ని తయారు చేసారన్నారు.. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం లో అందుబాటులో ఉన్న వెహికల్స్ తో పోల్చుకుంటే , తక్కువ ఖర్చు తో( కేవలం అరవై ఐదువేల రూపాయలతో), ఇంధన అవసరం లేకుండా , కాలుష్య సమస్య లేకుండా పర్యావరణానికి అనుకూలంగా విద్యార్థులు ఈ వాహనాన్ని తీర్చిదిద్దా లన్నారు. ఈ హైబ్రిడ్ వాహనాన్ని సౌర శక్తి తో పాటు, విద్యుత్ శక్తి ద్వారా కూడా నడపవచ్చన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించవచ్చని, తక్కువ శక్తి ని వినియోగించుకోవటం తో పాటు ఎక్కువ శక్తి సామర్ధ్యాలు కలిగిఉంటాయన్నారు. 200 కంపెనీ ల బరువు కల ఈ వాహనాన్ని 600 కేజీల లోడ్ లాగే విధం గా , ఒకేసారి 6 గురు ప్రయాణం చేసేలా డిజైన్ చేసారన్నారు. పట్టుదల ఉంటే అద్భుతాలు చేయవచ్చని, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యం తో సమాజానికి మరియు దేశానికీ ఉపయోగ పడేలా నూతన ఆవిష్కరణ లపై దష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం శశిధర్,, అకాడమిక్ డైరెక్టర్ పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు










