Nov 17,2022 22:58

ప్రజాశక్తి కంచికచర్ల 

కంచికచర్ల మండలం పరిటాల పరిధిలో గల అమ్రిత సాయి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రముఖ ఐటి కంపెనీ టెక్‌ మహీంద్రాలో ఉద్యోగాలు సాధించారని కళాశాల సెక్రటరీ అండ్‌ కరెస్పాండంట్‌ కె. రామ్మోహన రావు గురువారం తెలిపారు. కంపెనీ హెచ్‌ఆర్‌ ప్రతినిధులు ఇటీవల కళాశాలలో చదువుతున్న బి టెక్‌, ఫైనల్‌ ఇయర్‌ సీయస్‌ఈ, ఈసిఈ విద్యార్థులకు రాత పరీక్ష , గ్రూప్‌ డిస్కషన్స్‌, టెక్నికల్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను కంపెనీ తరుపున సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్స్‌ గా ఎంపిక చేసి 3.65 లక్షల వార్షిక వేతనం నిర్ణయించి వారికి నియామక ఉత్తర్వులు అందజేశారన్నారు. ఎంపికైన విద్యార్థులను గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ అండ్‌ కరెస్పాండంట్‌ కె . రామ్మోహన రావు , ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. శశిధర్‌ , ప్లేసెమెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. చిరంజీవి అయా విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.