Aug 10,2023 23:27

అమరావతి: మండల కేంద్రమైన అమరావతి లోని మండల పరిషత్‌ కార్యాలయలోని గురు వారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్వామా పిడి జోసఫ్‌ కుమార్‌ పాల్గొని మండల పరిధి గ్రామాలలో జరుగు తున్న ఉపాధి హామీ పనుల పనితీరు రికార్డులను, పనులలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టారు. సిబ్బంది ఉపాధి హామీ పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జోసఫ్‌ కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. సమావేశంలో విజిలెన్స్‌ జిల్లా అధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి ఎంపీపీ మేకల హనుమంతరావు ఏపీవో సుభద్ర పాల్గొన్నారు.