ప్రత్యేక పూజలు చేస్తున్న వైసీపీ నాయకుడు భూషి గౌడ్ కుటుంబ సభ్యులు
అమ్మవారికి విశేష పూజలు
ప్రజాశక్తి - పగిడ్యాల
మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో వెలిసిన మైసమ్మ దేవాలయంలో అమ్మ వారికి ఆదివారం వైసిపి నాయకులు భూషి గౌడ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మాపురం గ్రామానికి చెందిన ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంవత్సరానికి ఒకసారి మైసమ్మ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో మైసమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మ వారికి ఆదివారం వైసిపి నాయకులు భూషి గౌడ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్ గౌడ్, లలిత, జయమ్మ, నాగేంద్ర గౌడ్, హేమవతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










