ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
కంబదహాళ్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయులుగా పని చేస్తున్న బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న రచించిన 'అమ్మ ఒడి-ప్రేమ బడి' బాలగేయాల సంపుటిని సోమవారం ఆవిష్కరించారు. 'గురు సహస్రావధాని కడిమిళ్ల వరప్రసాద్, పెన్మెత్స సత్యనారాయణ, పొన్నాడ సుబ్రమణ్యం చేతుల మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురంలోని అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పెన్మెత్స సత్యనారాయణ రాజు దంపతులకు 'అంకితం' చేశారు. అనంతరం సోమన్నను సన్మానించారు. కవులు, ఉపాధ్యాయులు చక్రావధానుల రెడ్డప్ప ధవేజి, డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ, షేక్ సిలార్ సాహెబ్, మంకు శ్రీను, గాదిరాజు రంగరాజు, గిడుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు. సోమవారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సోమన్నను అభినందించారు.
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు










