నాన్న నిరంతరం
ప్రవహించే నది
అమ్మ
నిశ్శబ్ద మహా సముద్రం
జీవితాన్ని
వెలిగించే జ్యోతి అమ్మ
బ్రహ్మను సైతం
సష్టించింది అమ్మే కద !!
కవిత్వం రాయనిదే
నిద్ర పట్టదు
అమ్మని తలవనిదే
ముద్ద దిగదు !!
అమ్మ
నిత్యం వెలిగే కాంతి
ఆమెకిపుడు
ఆశ్రమంలోనే శాంతి
అమ్మ అంటేనే
వారసత్వ వారధి
సంస్క ృతి సంప్రదాయాల
రథసారథి
అమ్మ పిలుపు
అమృతమే
మరి నాన్న పలుకు
ఆధార భూతం
- ఉప్పరి తిరుమలేష్
96189 62384