ఆర్థిక సాయం అందజేస్తున్న దాతలు
ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న అమ్మ ఆశ్రమం శాశ్వత భవన నిర్మాణానికి యుటిఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, ఆయన సోదరులు సూర్యప్రకాష్ రావు, చంద్రశేఖర్, అడుగుల హరిబాబు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. ఆశ్రమ నిర్వాహకుడు గుంటుపల్లి చందు, విజయలక్ష్మి దంపతులకు ఈ విరాళం అందజేశారు. అనాధ వద్ధులకు ఆశ్రయం కల్పించి అన్నదానం నిర్వహిస్తున్న గుంటుపల్లి చందును ఈ సందర్భంగా అభినందించారు.










