Jan 23,2023 23:52

కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్న అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు వైస్‌ చైర్మన్‌ అర్జున

ప్రజాశక్తి-పరవాడ : మండలంలోని వాడచీపురుపల్లి గ్రామంలోని సామాజిక భవనం వద్ద అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన వృద్ధులకు, మహిళలకు సోమవారం కంటి అద్దాలు పంపిణీ చేశారు. డిసెంబర్‌ 8వ తేదీన అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి వారిచే వాడచీపురపల్లిలో కంటి వైద్య శిబిరం నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. ఇలా కంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి శంకర ఫౌండేషన్‌ సహాకారంతో అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు వైస్‌ చైర్మన్‌ సింగంపల్లి అర్జున చేతులమీదుగా సోమవారం ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి అద్దాలు సక్రమంగా వినియోగించుకుని రోజు వారి కార్యక్రమాలు చేసుకోవాలని ఈ సందర్భంగా అర్జున సూచించారు. కంటి అద్దాలు పంపిణీపై వృద్ధులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.