Nov 12,2023 15:56

మనకు ప్రాణం పోసి మనిషి జన్మనిచ్చేది అమ్మ.
తన గర్భంలో నవమాసాలు మోసేది అమ్మ.
అనుక్షణం మన గురించి ఆలోచించే దేవత అమ్మ.
అమృతం లాంటి ప్రేమను మనపై కురిపించేది అమ్మ.
మనకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయేది అమ్మ.
ఆప్యాయత, అనురాగాలతో బుద్ధులు చెప్పేది అమ్మ.
తొలి అడుగుల్లో తడబాటును సరిదిద్దేది అమ్మ.
బతుకు బాటలో పొరపాట్లను తెలియజేసేది అమ్మ.
తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది అమ్మ.
తన బిడ్డలు చదువుతూ ఎదిగిపోతే సంతోషించేది అమ్మ.
పిల్లలు జీవితంలో స్థిరపడితే పొంగిపోయేది అమ్మ.
బిడ్డల భవిష్యత్తును చూసి మురిసిపోయేది అమ్మ.
అమ్మ లేనిదే మనకు జన్మ లేదు.
సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు.

siri


వై.సిరిప్రియ,
9వ.తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం,
జనగామ జిల్లా,